శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై ధరల తగ్గింపు
ABN , First Publish Date - 2020-12-30T01:17:56+05:30 IST
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై ధరల తగ్గింపు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై ధరలను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్లపై రూ. 2000 తగ్గించినట్లు కంపెనీ వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో ఫోన్ రూ. 21,999 ఉండగా, తగ్గించిన ధరతో ప్రస్తుతం రూ. 19,999కే శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్‌కు 6.4 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.