బీఎస్4 ఔట్.. అద్భుత ఫీచర్లతో బీఎస్6 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ వచ్చేశాయ్.. ..

ABN , First Publish Date - 2020-03-21T22:21:42+05:30 IST

ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం సృష్టించింది.

బీఎస్4 ఔట్.. అద్భుత ఫీచర్లతో బీఎస్6 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ వచ్చేశాయ్.. ..

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఉన్న బీఎస్4 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అనుకున్న సమయం ఏప్రిల్ 1,2020 కంటే ముందే రాయల్ ఎన్‌ఫీల్డ్ బీఎస్4 బైక్‌లను అమ్మిన సంస్థగా భారతదేశంలో ఉన్న ఆటోమోటివ్ కంపెనీల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. మార్చి 21,2020 నుంచి పూర్తి స్థాయిలో కొత్త భారత్ స్టేజ్ 6 (బీఎస్6) రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. జనవరి నెలలోనే బీఎస్6 ప్రమాణాలతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ 350 బీఎస్6 మోడల్ ‌బైక్‌లు ఇప్పటికే డీలర్ల వద్దకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.  ఫ్లాగ్‌షిప్ 650 ట్విన్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, ఆర్ఈ కాంటినెంటల్ జీటీ 650 బీఎస్6 మోడల్ ధరలను ప్రకటించారు.

Updated Date - 2020-03-21T22:21:42+05:30 IST