కరోనా ఎఫెక్ట్‌.. 'వర్క్ ఫ్రం హోమ్' జియో శుభవార్త

ABN , First Publish Date - 2020-03-22T03:25:05+05:30 IST

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ వినియోగదారులకు తీపికబురు అందించింది.

కరోనా ఎఫెక్ట్‌.. 'వర్క్ ఫ్రం హోమ్' జియో శుభవార్త

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ వినియోగదారులకు తీపికబురు అందించింది. రిలయన్స్ జియో మరో కొత్త ఆఫర్ ప్రటించింది. 'వర్క్ ఫ్రం హోమ్' ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. 51 రోజుల కాల పరిమితితో రూ.251 ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ జియో పేర్కొంది. రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు.

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్‌ సోకి వేలాది మంది మృతి చెందారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాయి. నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో 'వర్క్ ఫ్రం హోమ్' ఆఫర్‌ను ప్రకటించింది.


Updated Date - 2020-03-22T03:25:05+05:30 IST