కొత్త స్కూటర్‌ను విడుదల చేయనున్న పియాజ్జియో ఇండియా
ABN , First Publish Date - 2020-11-26T23:01:28+05:30 IST
కొత్త స్కూటర్‌ను విడుదల చేయనున్న పియాజ్జియో ఇండియా

పుణె: ఇటలీకి చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ పియాజ్జియో ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త స్కూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. అద్భుత ఫీచర్లతో కొత్త స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్రముఖ సంస్థ పియాజ్జియో ఇండియా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రీమియం స్కూటర్‌ను ఆవిష్కరించే లక్ష్యంతో తమ మహోన్నతమైన వినియోగదారులకు సేవలను అందించనున్నట్లు పియాజ్జియో ఇండియా పేర్కొంది. త్వరలోనే బారామతి కర్మాగారంలో తమ ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఉత్పత్తిని ప్రారంభించనుంది.
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రీమియం ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్‌ను మొట్టమొదటిసారిగా గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2020లో ఆవిష్కరించారు. ఆటో ఎక్స్పో వద్ద అత్యున్నత ప్రశంసలు పొందిన స్కూటర్‌గా ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 గుర్తింపు పొందింది.
భారతదేశం కోసం ఇటలీలో డిజైన్ చేయబడిన ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఇప్పుడు నూతన బెంచ్‌మార్క్‌ను తమ వినూత్నమైన రేపటి తరాన్ని ఆకట్టుకునేలా ఉందని కంపెనీ పేర్కొంది. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఇప్పుడు ప్రీమియం స్కూటర్ మార్కెట్లో నూతన విభాగాన్ని సృష్టించనుంది. వినియోగదారులకు అత్యున్నత ప్రీమియం ఉత్పత్తులు మరియు కొనుగోలు అనుభవాలను అందించడం ద్వారా పియాజ్జియో ఇండియా అతి స్వల్పకాలంలోనే 250 డీలర్‌షిప్‌లు ఏర్పాటు చేసింది.