ఫోన్‌ను క్లీన్ చేసే అల్ట్రా వయొలెట్ డివైజ్!
ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST
కరోనా బారినపడకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటే సరిపోదు. ఎప్పుడూ చేతిలోనే ఉండే ఫోన్‌ను సైతం శానిటైజ్ చేసుకోవాలి. అలా అని ఫోన్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేయడం సరైన పద్ధతి కాదు...
కరోనా బారినపడకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటే సరిపోదు. ఎప్పుడూ చేతిలోనే ఉండే ఫోన్‌ను సైతం శానిటైజ్ చేసుకోవాలి. అలా అని ఫోన్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేయడం సరైన పద్ధతి కాదు. స్మార్ట్ఫోన్లను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా యూవీ స్టెరిలైజర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవకు చెందినదే మెస్సీ కార్నర్ యూవీ కేర్ స్టెరిలైజర్ అండ్ వైర్లెస్ చార్జర్. ఇది 99.9 శాతం వైర్‌సలను తొలగిస్తుంది. యూవీ-సి లైట్ స్టోరేజ్ బాక్స్‌లో మీ ఫోన్‌ను పెడితే చాలు. అంతేకాకుండా ఈ బాక్స్ పైన వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్ ఉంటుంది. ఇక్కడ ఫోన్‌ను వైర్లె్సగా చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ గ్యాడ్జెట్లో ఆరోమాథెరపీ ఛాంబర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎసెన్షియల్ ఆయిల్‌ను చల్లడం ద్వారా మీ ఫోన్ సుగంధ పరిమళం వెదజల్లుతుంది. ఈ మల్టీఫంక్షనల్ గ్యాడ్జెట్ ధర రూ.3,999.