భారత్‌లో విడుదలైన ‘ఒప్పో రెనో 3 ప్రొ’.. ధర ఎంతంటే?

ABN , First Publish Date - 2020-03-03T02:08:11+05:30 IST

స్మార్ట్‌ఫోన్ ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘ఒప్పో రెనో 3 ప్రొ’ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది

భారత్‌లో విడుదలైన ‘ఒప్పో రెనో 3 ప్రొ’.. ధర ఎంతంటే?

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘ఒప్పో రెనో 3 ప్రొ’ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. డ్యూయల్ పంచ్‌హోల్ సెల్ఫీ కెమెరా, వెనకవైపు నాలుగు కెమెరాలు వంటి పలు సరికొత్త ఆకర్షణలు ఈ ఫోన్ సొంతం. ఒప్పో రెనో 3 ప్రొ 128జీబీ ధర భారత్‌లో 29,990  కాగా, 256జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ.32,990 మాత్రమే. ఈ నెల ఆరో తేదీ నుంచి 128 జీబీ స్టోరేజీ వేరియంట్ అమ్మకానికి రానుండగా, 256 జీబీ డేటా వేరియంట్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేదీ సంస్థ వెల్లడించలేదు. లాంచింగ్ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. 


ఒప్పో రెనో 3 ప్రొ స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.7 అంగుళాల ఫుల్‌హెచ్ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో పీ95 ఎస్ఓసీ, 8 జీబీ ర్యామ్, 64 ఎంపీ+13 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 44 ఎంపీ+2 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 128 జీబీ, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 4,025 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి.

Updated Date - 2020-03-03T02:08:11+05:30 IST