ఈ ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 2 గొప్పదని ఒప్పుకుంటారా?

ABN , First Publish Date - 2020-03-03T02:05:11+05:30 IST

తినబోతూ రుచెందుకు? అని అంటారుగానీ.. అది సెల్‌ఫోన్ల విషయంలో ఆ సామెత పనిచేయదు. ఎందుకంటే - ఒక్క ఫోన్‌ కొనాలంటే ముందు వంద ఫోన్లు రుచి చూడాలి.

ఈ ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 2 గొప్పదని ఒప్పుకుంటారా?

తినబోతూ రుచెందుకు? అని అంటారుగానీ.. అది సెల్‌ఫోన్ల విషయంలో ఆ సామెత పనిచేయదు. ఎందుకంటే - ఒక్క ఫోన్‌ కొనాలంటే ముందు వంద ఫోన్లు రుచి చూడాలి. అదేనండీ - స్పెసిఫికేషన్స్‌ తెలుసుకోవాలి. రేటు అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి. సవాలక్ష వివరాలు కావాలి.


రోజుకి ముప్ఫై ఫోన్లు రిలీజవుతున్న ఈ కాలంలో  ఫోన్‌ గురించని తెలుసుకుంటాం? - అంటున్నారా?


అన్ని ఫోన్స్‌ గురించీ కాకపోయినా - కొన్ని హై-ఎండ్‌ ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే! కొన్నా కొనకపోయినా ఆ వివరాలు చూస్తే ఫోన్లలో కొత్త ఫీచర్స్‌ ఏం వస్తున్నాయో మనకి అర్థమవుతుంది.


మరి అతి త్వరలో రాబోతున్న ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 2 స్పెసిఫికేషన్స్‌ ఇవే :


Oppo Find X2

డిస్‌ప్లే 6.7- అంగుళాల శామ్‌సంగ్‌ OLED Full HD display

స్క్రీన్‌ రిజల్యూషన్‌ 3168x1440 పిక్సెల్స్‌ ( 120Hz రిఫ్రెష్‌ రేట్‌ )

ఫ్రంట్‌ కెమెరా 32-మెగాపిక్సెల్‌

నాలుగు బ్యాక్‌ కెమెరాలు  48,48,13 మెగాపిక్సెల్స్‌ - 5x హైబ్రిడ్‌ జూమ్‌

బ్యాటరీ 4260mAh ( 65W సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో )

ఆపరేటింగ్‌ సిస్టమ్‌ యాండ్రాయిడ్‌ 10


సరే. ఈ ఫీచర్స్‌ మీకు ఎలా అనిపించాయి?

ఈ ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 2 గొప్పదని ఒప్పుకుంటారా?

ఫీచర్లు గొప్పవే. కానీ ఈ ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 2 రేటెంతో తెలుసా?

డెబ్భై వేల పై మాటే!

ఆ లెక్కన చూస్తే .. ఇవి అదిరిపోయే ఫీచర్స్‌ ఏం కాదని చెప్పాల్సి ఉంటుంది.

Updated Date - 2020-03-03T02:05:11+05:30 IST