-
-
Home » Technology » Nokia new Nokia phone
-
అదిరిపోయే ఫీచర్లతో నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ విడుదల
ABN , First Publish Date - 2020-12-16T04:01:42+05:30 IST
అదిరిపోయే ఫీచర్లతో నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ కమ్యూనికేషన్స్ సంస్థ నోకియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూరోపియన్ మార్కెట్‌లో నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు నోకియా బ్రాండ్ లైసెన్సు హెచ్‌ఎండీ గ్లోబల్ పేర్కొంది.
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 16,900 ఉంటుందని కంపెనీ వెల్లడించింది. నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఎప్పుడు విడుదల చేస్తారన్నది కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.