‘గూగుల్‌ పే ఇండియా’కు కొత్త లోగో

ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST

‘గూగుల్‌ పే ఇండియా’ కొత్త లోగోతో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఉన్న లోగోకు భిన్నంగా కొత్తది రంగులతో ఆకట్టుకుంటోంది. కొత్త లోగో ఇంకా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో అప్‌డేట్‌ కావాల్సి ఉంది...

‘గూగుల్‌ పే ఇండియా’కు కొత్త లోగో

‘గూగుల్‌ పే ఇండియా’ కొత్త లోగోతో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఉన్న లోగోకు భిన్నంగా కొత్తది రంగులతో ఆకట్టుకుంటోంది. కొత్త లోగో ఇంకా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో అప్‌డేట్‌ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న లోగో ‘జి పే’ సింపుల్‌గా ఉంటుంది. ఎడమవైపు బ్యాక్‌గ్రౌండ్‌ తెలుపులో, కుడివైపు నీలిరంగులో ఉంటుంది. నిజానికి సరైన డిజైన్‌ లేదు. కొత్త డిజైన్‌ నీలి, ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎర్ర రంగులతో ఆకట్టుకునేలా ఉంది. న్యూ గూగుల్‌ వర్క్‌స్పేస్‌ లోగోల మాదిరిగా భిన్న రంగులతో కనిపిస్తోంది. లోగో రీడిజైనింగ్‌ మినహా మరే మార్పులు గూగుల్‌ పే యాప్‌లో లేవు.  భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ విజయవంతమైన తరవాతే ఇతర దేశాలకు దానిని విస్తరించారు.

Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST