మైక్రోసాఫ్ట్ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘సర్ఫేస్ డుయో’

ABN , First Publish Date - 2020-05-17T22:03:41+05:30 IST

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఆండ్రాయిడ్ ఫోల్డబుల్ ఫోన్ ‘సర్ఫేస్ డుయో’ను తీసుకురాబోతోంది. క్వాల్‌కామ్

మైక్రోసాఫ్ట్ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘సర్ఫేస్ డుయో’

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఆండ్రాయిడ్ ఫోల్డబుల్ ఫోన్ ‘సర్ఫేస్ డుయో’ను తీసుకురాబోతోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855ను ఇందులో ఉపయోగించనుంది. 6జీబీ ర్యామ్, 64జీబీ లేదంటే 256 జీబీ స్టోరేజీ ఆప్షన్లతో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ఒకే ఒక్క కెమెరా ఉండే అవకాశం ఉంది. డిస్‌ప్లే కుడివైపున పైన 11 ఎంపీ కెమెరాను అమర్చింది. ఫొటోలు, వీడియోల కోసం దీనిని సెల్ఫీ కెమెరాగానూ, రియర్ కెమెరాగానూ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. 


మైక్రోసాఫ్ట్ ‘సర్ఫేస్ డుయో’లో సమాన పరిణామంలో ఉండే 5.6 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను ఉపయోగించారు. రెండు డిస్‌ప్లేలు పూర్తిగా తిరిగేలా ఓ ‘హింగ్’ను ఏర్పాటు చేశారు. దీనివల్ల డిస్‌ప్లేను ఏ కోణంలోనైనా తిప్పుకుని సర్దుబాటు చేసుకోవచ్చు. ఇటీవలే ఈ కొత్త హింగ్‌కు పేటెంట్ లభించింది. ఈ కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. 3,460 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఫోన్లలో ఉపయోగిస్తున్న బ్యాటరీల సామర్థ్యం కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. 

Updated Date - 2020-05-17T22:03:41+05:30 IST