ఉద్యోగులపై వేటేసిన మైక్రోసాఫ్ట్
ABN , First Publish Date - 2020-07-18T21:01:26+05:30 IST
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉద్యోగులపై వేటేసింది. జులై 1న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫోర్స్‌ను

వాషింగ్టన్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉద్యోగులపై వేటేసింది. జులై 1న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫోర్స్‌ను తగ్గించినట్టు స్వయంగా ప్రకటించింది. అయితే, ఎంతమందిని తొలగించింది? ఏయే విభాగాల్లో కోతలు కోసింది? ఏయే దేశాల్లో తొలగించింది? అన్న విషయాలను వెల్లడించేందుకు నిరాకరించింది. అయితే, మొత్తంగా 1000 మందిని తొలగించినట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ఎంఎస్ఎన్ డాట్ కామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్గోరిథమిక్ ఫీడ్‌కు మారడంతో అందులోని ఉద్యోగులతోపాటు, మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ విభాగంలోని ఉద్యోగులపైనా వేటేసినట్టు తెలుస్తోంది.