65 అంగుళాల టీవీ.. ఎయిర్ ప్యూరిఫైర్‌ను విడుదల చేసిన షియోమీ

ABN , First Publish Date - 2020-03-29T02:05:04+05:30 IST

చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ నుంచి మరో సరికొత్త టీవీ వచ్చేసింది. శుక్రవారం ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా ‘ఎంఐ టీవీ 4ఎస్ 65’

65 అంగుళాల టీవీ.. ఎయిర్ ప్యూరిఫైర్‌ను విడుదల చేసిన షియోమీ

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ నుంచి మరో సరికొత్త టీవీ వచ్చేసింది. శుక్రవారం ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా ‘ఎంఐ టీవీ 4ఎస్ 65’ అంగుళాల మోడల్‌ను విడుదల చేసింది. డీటీఎస్-హెచ్‌డీ, డాల్బీ ఆడియో సౌండ్ వంటివి ఉన్నాయి. ఈ టీవీతోపాటు ‘ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్‌ 3హెచ్’ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ప్యూరిఫైర్‌కు అమెజాన్ అలెగ్జా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉండడం గమనార్హం. ఎంఐ టీవీ 4ఎస్ 65 అంగుళాల టీవీ ధర భారత కరెన్సీలో దాదాపు 45,900. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 3హెచ్ ధర రూ. 15 వేలు ఉండే అవకాశం ఉంది.


ఎంఐ టీవీ 4ఎస్ 65 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌ను ఈ టీవీలో ఉపయోగించారు. ఐపీఎస్ డిస్‌ప్లే, 4కె రిజల్యూషన్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్స్, గూగుల్ ప్లే యాక్సెస్ వంటివి ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, మూడు యూఎస్‌బీ పోర్టులు, బ్లూటూత్ సపోర్ట్, వాయిస్ రిమోట్ కంట్రోల్, 10 వాట్ స్పీకర్లు ఉన్నాయి. 


ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 3హెచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:  45 చదరపు మీటర్ల రూము కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులోని న్యూ ఎయిర్ డక్ట్ సిస్టం ద్వారా నిమిషానికి 6,330 లీటర్ల శుద్ధి చేసిన గాలిని విడుదల చేసింది. అతి తక్కువ శబ్దాన్ని విడుదల చేస్తుంది. బరువు 4.8 కిలోలు. ఇందులోని పీఎం సెన్సార్ గాలిలోని మైక్రోస్కోపిక్ కణాలను గుర్తించి గది గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి చెబుతుంది. 

Updated Date - 2020-03-29T02:05:04+05:30 IST