-
-
Home » Technology » Mi India Mi QLED 4K TV India
-
అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ 4కే స్మార్ట్‌టీవీ..
ABN , First Publish Date - 2020-12-15T22:52:22+05:30 IST
అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ 4కే స్మార్ట్‌టీవీ..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ షియోమి సబ్ బ్రాండ్ ఎంఐ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో సరికొత్త మోడల్‌లో స్మార్ట్‌టీవీని విడుదల చేయనున్నట్లు ఎంఐ ఇండియా ప్రకటించింది. డిసెంబర్ 16వ తేదీన ఎంఐ క్యూఎల్ఈడీ 4కే స్మార్ట్‌టీవీని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది.
ఎంఐ టీవీలో డాల్బీ విజన్, డాల్బీ ఆడియోతో పాటు యాజమాన్య వివిడ్ పిక్చర్ ఇంజిన్, ప్యాచ్‌వాల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయని ఎంఐ ఇండియా వెల్లడించింది. 2021లో 'మేక్ ఇన్ ఇండియా' చొరవ కింద దాదాపు 100శాతం వరకు విస్తరించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.