అద్భుత ఫీచర్లతో కొత్త ఎంఐ 10 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2020-03-28T22:45:29+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది.

అద్భుత ఫీచర్లతో కొత్త ఎంఐ 10 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త ఎంఐ 10 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు షియోమి ప్రకటించింది. యూరోపియన్ మార్కెట్లలో కొత్త ఎంఐ 10 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఎంఐ 10 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 29,200 ఉంటుంది. ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు మే నెలలో ప్రారంభంలోనే ఫోన్లను పొందవచ్చని సంస్థ తెలిపింది. నాలుగు రంగుల్లో కొత్త ఎంఐ 10 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్లను రూపొందించారు. భారత మార్కెట్‌లో ఎంఐ 10 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్లను ఎప్పుడు విడుదల చేస్తారన్నది కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

Updated Date - 2020-03-28T22:45:29+05:30 IST