అనుకున్న మీటింగ్‌ లేదు! అసలు ఆఫీసుకే రావద్దు!

ABN , First Publish Date - 2020-03-14T02:14:02+05:30 IST

ఆఫీసుకి పోకుండా ఇంటిదగ్గరనుంచే పని చేయాలనుకునేవాళ్లకి కరోనా వైరస్‌ కొద్దికాలంగా ఆ అవకాశం కల్పిస్తూ ఉంది.

అనుకున్న మీటింగ్‌ లేదు! అసలు ఆఫీసుకే రావద్దు!

ఆఫీసుకి పోకుండా ఇంటిదగ్గరనుంచే పని చేయాలనుకునేవాళ్లకి కరోనా వైరస్‌ కొద్దికాలంగా ఆ అవకాశం కల్పిస్తూ ఉంది. పెద్ద పెద్ద గ్లోబల్‌ సంస్థలన్నీ తమ ఉద్యోగుల్లో కొన్ని విభాగాల వారిని ఇంటి దగ్గరనుంచే పని చేయాలంటూ ఆదేశాలు జారీ చేశాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే గూగుల్‌, ట్విట్టర్‌, అమెజాన్‌ సంస్థలు ఈ జాబితాలో ఉండగా - ఇప్పుడు కొత్తగా ప్రపంచ ప్రసిద్ధ శ్నాప్‌చాట్‌ సంస్థ కూడా ఇందులోకి చేరింది.


తాజాగా - శ్నాప్‌చాట్‌ సిఇవో ఇవాన్‌ స్పీగిల్‌ తన ఉద్యోగులందరినీ ఇంటినుంచే పనిచేయమని కోరడం జరిగింది. అంతే కాదు, ఒక ముఖ్యమైన శ్నాప్‌చాట్‌ ఈవెంట్‌ కూడా కరోనా కారణంగా పోస్ట్‌పోన్‌ అయింది. ఏప్రిల్‌ 2 న జరగనున్న ఈ ఈవెంట్‌లో శ్నాప్‌చాట్‌ డెవలపర్లూ, ఎడ్వర్టయిజర్లూ, క్రియేటర్లూ అంతా కలవాలని ప్లాన్‌ చేసుకున్నారు.

Updated Date - 2020-03-14T02:14:02+05:30 IST