లావా నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. నమ్మశక్యం కాని తక్కువ ధర!

ABN , First Publish Date - 2020-02-08T03:25:13+05:30 IST

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా నుంచి అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. జడ్ (Z) సిరీస్‌లో

లావా నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. నమ్మశక్యం కాని తక్కువ ధర!

న్యూఢిల్లీ: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా నుంచి అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. జడ్ (Z) సిరీస్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్ పేరు ‘లావా జడ్53’. కొత్తగా స్మార్ట్‌ఫోన్‌లోకి మారాలనుకునే వారికి ఇది చక్కగా సరిపోతుందని కంపెనీ తెలిపింది. 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 1జీబీ ర్యామ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.4,829 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు దేశవ్యాప్తంగా అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంది. 


ఫీచర్లు: 6.1 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, డ్యూడ్రాప్ నాచ్, 1.4GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 16జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 9పై (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో 4120 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్‌పై ఏడాది పాటు వారెంటీ ఇస్తున్నట్టు లావా పేర్కొంది. 

Updated Date - 2020-02-08T03:25:13+05:30 IST