-
-
Home » Technology » Laptop cum Tablet For Mere Laptop Price
-
ల్యాప్‌టాప్ ఖరీదుకే ల్యాప్‌టాప్-కమ్-ట్యాబ్లెట్!
ABN , First Publish Date - 2020-03-13T23:50:08+05:30 IST
అది కేవలం ల్యాప్‌టాప్ కాదు. కన్వర్టిబుల్ అంటారు. అంటే - ఇందులో కీబోర్డ్ - మామూలు ల్యాప్‌టాప్‌ల మాదిరిగా కేవలం కొంతవరకూ కాకుండా - మొత్తం యాంగిల్ వెనక్కి తిరుగుతుంది

అది కేవలం ల్యాప్‌టాప్ కాదు. కన్వర్టిబుల్ అంటారు. అంటే - ఇందులో కీబోర్డ్ - మామూలు ల్యాప్‌టాప్‌ల మాదిరిగా కేవలం కొంతవరకూ కాకుండా - మొత్తం యాంగిల్ వెనక్కి తిరుగుతుంది. అలా కీబోర్డ్‌ని మడతపెట్టి మానిటర్ వెనక్కి పెట్టేయచ్చు. అంటే అది ఓ టాబ్లెట్ మాదిరిగా అయిపోతుందన్నమాట. దీన్నే ల్యాప్‌టాప్ కన్వర్టిబుల్ అంటారు.
మామూలుగా చెప్పాలంటే దీన్ని 'ల్యాప్‌టాప్-కమ్-ట్యాబ్లెట్' అని చెప్పవచ్చు. ల్యాప్‌టాప్ గా కూడా మారే వీలుంది కాబట్టి - సాధారణ ల్యాప్‌టాప్ కంటే ఈ రకం కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్స్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ టెక్లాస్ట్ కంపెనీ F6 Plus అనే తన కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌ని మామూలు ల్యాప్ టాప్ ధరకే అందిస్తోంది.
దీన్ని ట్యాబ్లెట్‌గా మాత్రమే యూజ్ చేసుకోవడం కాదు, ఐపాడ్ ప్రో మాదిరిగా దీనిమీద ప్రత్యేకమైన స్టైలస్‌తో రాసుకోవచ్చు కూడా! బ్యాటరీ లైఫ్ కాస్త యావరేజ్‌గా ఉన్నప్పటికీ - దీని నిర్మాణం చాలా ముచ్చటగొలిపేలా ఉంది. చీప్ ధరలో దొరుకుతూనే టూ-ఇన్-వన్ ల్యాప్‌టాప్ అనిపించుకునే F6 Plus అనే ఈ కన్వర్టిబుల్ డివైజ్‌ని టెక్లాస్ట్ కంపెనీ దాదాపు 360 డాలర్లకి అందిస్తోంది. రూపాయల్లో దీని ఖరీదు 30 వేల లోపు!