కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-03-04T23:41:55+05:30 IST

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన చేసింది.

కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2020 ఫిబ్రవరి నెలలో 15,644 యూనిట్లను  విక్రయించినట్లు కియా మోటార్స్ ఇండియా ప్రకటించింది. గత నెలలో 14,024 యూనిట్ల కియా సెల్టోస్ కార్లు, 1,620 యూనిట్ల కార్నివాల్ ఎంపీవీ కార్లను అమ్మినట్లు తెలిపింది. కియా సెల్టోస్ కారు ప్రారంభ ధర రూ. 9.89 లక్షల నుంచి 16.29 లక్షలు ఉంటుంది. కార్నివాల్ ఎంపీవీ కారు ధర రూ. 24.95 లక్షలు ఉంటుంది. 2020 జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో కియా కార్ల అమ్మకాలు 1.3 శాతం పెరిగినట్లు కియా మోటార్స్ ఇండియా ప్రకటించింది.

Updated Date - 2020-03-04T23:41:55+05:30 IST