పాస్వర్డ్ లేకుండా రీసెట్ సాధ్యమా?
ABN , First Publish Date - 2020-12-05T05:49:56+05:30 IST
ఎవరుబడితే వారు పొరపాటున ఆండ్రాయిడ్ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా అడ్డుకోవడం కోసం గూగుల్ సంస్థ పాస్‌వర్డ్‌తో సంబంధం లేకుండా ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ తెలుపమని సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది...

నా ఆండ్రాయిడ్ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంటే గూగుల్ పాస్వర్డ్ అడుగుతోంది. పాస్‌వర్డ్‌తో సంబంధం లేకుండా ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయలేమా?
- కారుణ్య, వరంగల్
ఎవరుబడితే వారు పొరపాటున ఆండ్రాయిడ్ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా అడ్డుకోవడం కోసం గూగుల్ సంస్థ పాస్‌వర్డ్‌తో సంబంధం లేకుండా ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ తెలుపమని సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ అలా అడగటం మీకు ఇబ్బందిగా ఉంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ముందు మీ ఫోన్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ అనే విభాగంలో గూగుల్ అకౌంట్‌ని తొలగించండి. దీనికి ప్రత్యామ్నాయంగా మీ ఫోన్లో డెవలపర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఓఐఎం అన్‌లాక్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నా సరిపోతుంది. ఈ రెంటితో పాటు, మీ ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి, హార్డ్‌వేర్ కీల ద్వారా రికవరీ మోడ్‌లోకి వెళ్లి కూడా దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు.