అన్ని ఫైల్స్ కనిపించాలంటే?
ABN , First Publish Date - 2020-12-05T05:51:50+05:30 IST
ఫోన్ని పిసికి కనెక్ట్ చేసినప్పుడు ఇంటర్నల్ మెమరీ, మెమరీ కార్డులో కేవలం ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అన్ని ఫైల్స్ కనిపించడం లేదు. దీనికి పరిష్కారం చెప్పగలరు

ఫోన్ని పిసికి కనెక్ట్ చేసినప్పుడు ఇంటర్నల్ మెమరీ, మెమరీ కార్డులో కేవలం ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అన్ని ఫైల్స్ కనిపించడం లేదు. దీనికి పరిష్కారం చెప్పగలరు.
- రాజేంద్ర, వైజాగ్
డేటా కేబుల్ ద్వారా మీ ఫోన్ని పిసికి కనెక్ట్ చేసిన వెంటనే ప్రధానంగా మూడు రకాల మోడ్లు లభిస్తాయి. వాటిలో మీరు ఫొటో ట్రాన్స్ఫర్ అనేది పొరబాటున ఎంచుకున్నప్పుడు కేవలం మీ ఫోన్లో ఉన్న ఫొటోలు మాత్రమే మీ కంప్యూటర్లో కనిపిస్తాయి. అలా కాకుండా మీరు కోరుకున్నట్లు అన్ని రకాల ఫైల్స్ కనపడాలంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అనే మోడ్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటితో పాటు మీ కంప్యూటర్లోని యూఎస్బీ పోర్ట్ ద్వారా కేవలం ఛార్జింగ్ మాత్రమే చేసుకోగలిగే విధంగా ఛార్జింగ్ అనే ఆప్షన్ కూడా లభిస్తుంది. ఫైళ్లను బదిలీ చేసుకోవటం మీ ఉద్దేశం కానప్పుడు, తాత్కాలికంగా మీ ఫోన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఎంచుకోవాలి.