ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడమెలా?

ABN , First Publish Date - 2020-08-01T08:00:30+05:30 IST

కరోనా నేపథ్యంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆన్‌లైన్‌ జాబ్స్‌ ద్వారా డబ్బు సంపాదించే సైట్లలో

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడమెలా?

కరోనా నేపథ్యంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆన్‌లైన్‌ జాబ్స్‌ ద్వారా డబ్బు సంపాదించే సైట్లలో చాలా వరకూ మోసపూరితంగా ఉంటున్నాయి. మంచి సైట్లను సూచించగలరు. 

- శ్రీనివాస్‌, నిజామాబాద్‌


ఆన్‌లైన్‌ జాబ్స్‌ అంటూ... నెలకు వేలు సంపాదించవచ్చు అంటూ ప్రకటనలు ఇస్తూ చాలా సైట్లు మోసం చేస్తున్నాయి. ఇలాంటి వాటి వలలో పడి చాలామంది డబ్బు, సమయాన్ని నష్టపోతున్నారు. పెద్దగా కష్టపడకుండానే డబ్బు సంపాదించాలి అనే ధోరణి అన్నింటికన్నా ప్రమాదకరం. దీనికన్నా ఏదో రంగంలో నైపుణ్యం సంపాదించుకుని జట్ఛ్ఛజ్చూుఽఛ్ఛి.జీుఽ వంటి కొన్ని సైట్లలో మీ నైపుణ్యాలను వెల్లడించి, ఫ్రీలాన్సింగ్‌ ద్వారా ఆదాయం పొందొచ్చు. నైపుణ్యం పెంచుకున్నప్పుడు మాత్రమే అవకాశాలు వస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com

Updated Date - 2020-08-01T08:00:30+05:30 IST