ఆండ్రాయిడ్‌ యాప్స్‌గా మార్చుకోవచ్చా?

ABN , First Publish Date - 2020-12-05T05:54:32+05:30 IST

ఆండ్రాయిడ్‌ ఇంతగా పాపులర్‌ అవడానికి ముందు నోకియా 6600 వంటి ఫోన్లలో సింబియాన్‌ సిరీస్‌ 60, సోనీ ఎరిక్సన్‌ ఫోన్లలో సింబియాన్‌ యుఐక్యూ సిరీస్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఉండేవి...

ఆండ్రాయిడ్‌ యాప్స్‌గా మార్చుకోవచ్చా?

నేను ఒకప్పుడు .సిస్‌ ఎక్స్‌టెన్షన్‌ నేమ్‌ ఉన్న యాప్స్‌ని నోకియా ఫోన్‌లో వాడుకునేవాడిని. వాటిలో కొన్ని యాప్స్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్‌కి లభించడం లేదు. అప్పట్లో ఉన్న .సిస్‌ యాప్స్‌ని ఆండ్రాయిడ్‌ యాప్స్‌గా మార్చుకోటానికి సాధ్యపడుతుందా?

 - మూర్తి, విజయవాడ


ఆండ్రాయిడ్‌ ఇంతగా పాపులర్‌ అవడానికి ముందు నోకియా 6600 వంటి ఫోన్లలో సింబియాన్‌ సిరీస్‌ 60, సోనీ ఎరిక్సన్‌ ఫోన్లలో సింబియాన్‌ యుఐక్యూ సిరీస్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఉండేవి. మీరు అడిగినట్లు .సిస్‌ అనే ఎక్స్‌టెన్షన్‌ ఆ ఆపరేటింగ్‌ సిస్టం కోసం తయారు చేసిన యాప్స్‌కి ఉంటుంది. పూర్తిస్థాయిలో అప్పట్లో మీరు వాడిన యాప్స్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో పని చేస్తాయా లేదా అన్నది సందేహమే అయినప్పటికీ కొన్ని పద్ధతుల ద్వారా ప్రయత్నించవచ్చు. .సిస్‌ టు జార్‌ కన్వర్టర్‌ అనే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా మీ దగ్గర ఉన్న .సిస్‌ ఫైల్‌ని జావా ఆధారిత ప్రోగ్రాములుగా మార్పిడి చేసుకోండి. తదుపరి ఆ జావా ఫైల్‌ని నెట్‌మైట్‌ వంటి వెబ్‌ సర్వీసుల ద్వారా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో పనిచేసే ఏపికె ఫైళ్లుగా కన్వర్ట్‌ చేసుకోవచ్చు. అయితే గతంలో మీరు సింబియాన్‌ ఫోన్లలో పొందిన పూర్తిస్థాయి ప్రయోజనాలు ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో లభిస్తాయా లేదా అన్నది ఆ యాప్స్‌లో ఉండే ఫంక్షనాలిటీ, వాటిని ఆండ్రాయిడ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఎంత వరకూ సపోర్ట్‌ చేస్తుంది వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Updated Date - 2020-12-05T05:54:32+05:30 IST