మన వాట్సాప్‌ అకౌంట్‌తో మరొకరు...?

ABN , First Publish Date - 2020-10-24T07:01:27+05:30 IST

వ్యక్తుల వాట్సాప్‌ అకౌంట్‌ను హ్యాకర్లు వివిధ పద్ధతుల్లో వాడుతూ ఉంటారు. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేని హ్యాకర్లు చేసే పని ఏమంటే, ఫోన్‌ నుంచి వాట్సాప్‌ వెబ్‌ని వారి కంప్యూటర్లో క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేసి ఉపయోగిస్తుంటారు...

మన వాట్సాప్‌ అకౌంట్‌తో మరొకరు...?

మన వాట్సాప్‌ అకౌంట్‌ మనకు తెలియకుండా ఇతరులు వాడే ప్రమాదం ఏదైనా ఉంటుందా? 

- కీర్తి, హైదరాబాద్‌


వ్యక్తుల వాట్సాప్‌ అకౌంట్‌ను హ్యాకర్లు వివిధ పద్ధతుల్లో వాడుతూ ఉంటారు. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేని హ్యాకర్లు చేసే పని ఏమంటే, ఫోన్‌ నుంచి వాట్సాప్‌ వెబ్‌ని వారి కంప్యూటర్లో క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేసి ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా వాడేటప్పుడు కచ్చితంగా ఆ సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ మీ ఫోన్‌లో చూపిస్తుంది. దానిద్వారా జాగ్రత్త పడవచ్చు. ఇది కాకుండా మీ ఫోన్‌ మ్యాక్‌ ఐడి(మెషీన్‌ ఐడి)ని తెలుసుకున్నట్లయితే, హ్యాకర్లు తమ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్‌ ఫోన్‌ రూట్‌ చేస్తారు. దాంట్లో తమ ఫోన్‌ అసలు మ్యాక్‌ ఐడి స్థానంలో మీ మ్యాక్‌ ఐడి స్ఫూఫ్‌ చేస్తారు. వాట్సప్‌ సెటప్‌ చేసేటప్పుడు వచ్చే ఓటీపిని వివిధ ఇతర పద్ధతుల ద్వారా మీ ఫోన్‌ నుంచి తెలుసుకుని వారు కూడా అదే వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. దీనితోపాటు మీ ఫోన్‌ నెంబర్‌ తెలిస్తే, దాన్ని వివిధ పద్ధతుల ద్వారా హ్యాక్‌ చెయ్యగలిగితే, హ్యాకర్‌ తన ఫోన్లో మీ నెంబర్‌ ఎంటర్‌ చేసి వాట్సాప్‌ యాక్టివేట్‌ చేస్తూ, మీ ఫోన్‌కి వచ్చే ఓటీపిని కూడా ఎంటర్‌ చేసి,  మీ ప్రమేయం లేకుండా వాట్సాప్‌ అకౌంట్‌ వాడే ప్రమాదం ఉంటుంది.


Updated Date - 2020-10-24T07:01:27+05:30 IST