ఇక ప్రతిటీవీ స్మార్ట్‌ టీవీయే అంటున్నారు వీళ్లు!

ABN , First Publish Date - 2020-03-13T22:37:12+05:30 IST

స్మార్ట్‌ టీవీలు ఓ పక్క పెరుగుతూ పోతుంటే - మరో పక్క మామూలు టీవీల్ని స్మార్ట్‌ టీవీ మాదిరిగా ఎంజాయ్‌ చేయగలిగేలా చేసే సౌకర్యాలూ పెరుగుతూ వస్తున్నాయి.

ఇక ప్రతిటీవీ స్మార్ట్‌ టీవీయే అంటున్నారు వీళ్లు!

స్మార్ట్‌ టీవీలు ఓ పక్క పెరుగుతూ పోతుంటే - మరో పక్క మామూలు టీవీల్ని స్మార్ట్‌ టీవీ మాదిరిగా ఎంజాయ్‌ చేయగలిగేలా చేసే సౌకర్యాలూ పెరుగుతూ వస్తున్నాయి.


తాజాగా వీడియోకాన్‌ డీటూహెచ్‌ స్ట్రీమ్‌ అనే ఎంటర్‌టైన్‌మెంట్‌ బాక్స్‌ని రిలీజ్‌ చేసింది. ఇది కేవలం టీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ మాత్రమే కాదు, ఇంటర్‌నెట్‌ ఎనేబుల్డ్‌ యాండ్రాయిడ్‌ బాక్స్‌ కూడా! అంటే - దీన్ని టీవీకి కనెక్ట్‌ చేసుకుంటే ప్రతి టీవీ కూడా స్మార్ట్‌ టీవీగా మారిపోతుంది. యూట్యూబ్‌ లాంటి వాటితో బాటు - అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి స్ట్రీమింగ్‌ సర్వీసులన్నిటినీ కూడా ఎంజాయ్‌ చేయవచ్చు. కొత్త కస్టమర్ల కోసం దీన్ని 3999 రూపాయలకి అందిస్తున్నారు వీడియోకాన్‌ వాళ్లు.


దీంతో బాటే స్మార్ట్‌ టీవీలకోసం D2h మేజిక్‌ స్టిక్‌ అనే మరో డివైజ్‌ కూడా రిలీజ్‌ చేసింది వీడియోకాన్‌. D2h మేజిక్‌ స్టిక్‌ అనేది వాయిస్‌ ఎనేబుల్డ్‌ కిట్‌. దీని డాంగిల్‌ ని స్మార్ట్‌ టీవీకి కనెక్ట్‌ చేసి రిమోట్‌ తో ఇంటర్‌నెట్‌ సర్వీసుల్ని యాక్సెస్‌ చేయవచ్చు. దీని రిమోట్‌ అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి - పనులన్నీ మాటలతో అయిపోతాయి. అదీ సంగతి!

Updated Date - 2020-03-13T22:37:12+05:30 IST