నెట్‌ అలా వాడుకోవచ్చా?

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

అవసరం లేనప్పుడు కేవలం వాట్సప్‌ ఒక్కదానికి ఇంటర్నెట్‌ ఆఫ్‌ చేసుకునే అవకాశం ఏదైనా ఉందా?

నెట్‌ అలా వాడుకోవచ్చా?

అవసరం లేనప్పుడు కేవలం వాట్సప్‌ ఒక్కదానికి  ఇంటర్నెట్‌ ఆఫ్‌ చేసుకునే అవకాశం ఏదైనా ఉందా? 

 విమల


ఒక చిన్న టెక్నిక్‌ అనుసరించి ఆ సదుపాయం పొందొచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి ‘నో రూట్‌ ఫైర్‌వాల్‌’ అనే అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని, దాని కాన్ఫిగరేషన్‌ సెట్టింగ్స్‌లో  అప్లికేషన్స్‌ అనే విభాగంలో వాట్సప్‌ వెతికి పట్టుకొని,  దానికి మొబైల్‌ డేటా మరియు వైఫైలో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ నిలిపివేయబడే విధంగా కాన్ఫిగర్‌  చేసుకోవచ్చు. దాంతో ఇక మీదట మిగిలిన అప్లికేషన్స్‌ ఇంటర్నెట్‌ వస్తుంది కానీ, వాట్సప్‌కి మాత్రం ఇంటర్నెట్‌ ఆగిపోతుంది. అయితే ఈ అప్లికేషన్‌ ఒక ప్రత్యేకమైన విపిఎన్‌ కనెక్షన్‌  ఎస్టాబ్లిష్‌ చేయటం ద్వారా ఇలా కావలసిన అప్లికేషన్స్‌కి ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ చేసుకునే సౌకర్యం ఇస్తుంది. ఆ విపిఎన్‌ నుండి డిస్‌కనెక్ట్‌ అయిన వెంటనే  మళ్లీ తిరిగి వాట్సప్‌ లభిస్తుంది. ఏకంగా మొబైల్‌ డేటా ఆఫ్‌ చేసుకోవడం కాకుండా కేవలం వాట్సప్‌ వరకు ఇంటర్నెట్‌ లేకుండా ఆఫ్‌ చేసుకోవచ్చు

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST