మెయిల్ ఐడీ తెలుసుకోవచ్చా?
ABN , First Publish Date - 2020-03-21T06:25:06+05:30 IST
యూట్యూబ్‌లో ఉన్న ప్రతీ ఛానెల్ ఒక నిర్దిష్టమైన ఈ-మెయిల్ అడ్రస్‌తో లింక్ చేయబడి ఉంటుంది. అయితే ఆ ఈ- మెయిల్ అడ్రస్ వివరాలు ప్రత్యక్షంగా తెలుసు కోవటానికి
మనం యూట్యూబ్‌లో ఒక ఛానెల్‌ను సబ్స్క్రయిబ్ చేస్తూ ఉంటాం కదా! దానికి సంబంధించిన ఈ - మెయిల్ అడ్రస్ తెలుసుకునే అవకాశం ఉంటుందా?
- భరత్ బత్తుల, నిజామాబాద్
యూట్యూబ్‌లో ఉన్న ప్రతీ ఛానెల్ ఒక నిర్దిష్టమైన ఈ-మెయిల్ అడ్రస్‌తో లింక్ చేయబడి ఉంటుంది. అయితే ఆ ఈ- మెయిల్ అడ్రస్ వివరాలు ప్రత్యక్షంగా తెలుసు కోవటానికి యూట్యూబ్ అవకాశం కల్పించదు. ఏదైనా పోలీస్ కేస్ అయినప్పుడు మాత్రమే, నేర పరిశోధనా సంస్థలకు గూగుల్ సంస్థ ఆ యూట్యూబ్ అకౌంట్ లింక్ అయి ఉన్న మెయిల్ ఐడీ, దాన్ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి తాజా ఐపీ అడ్రస్ వంటి వివరాలు తెలియజేస్తుంది. అంతేతప్ప సాధారణ యూజర్లు చేయగలిగిందేమీ లేదు.