-
-
Home » Technology » BSNL Offering Free SIM Until January 1
-
బీఎస్‌ఎన్‌ఎల్ డిసెంబర్ 17 నుంచి తెస్తున్న ఆఫర్ ఏంటంటే..
ABN , First Publish Date - 2020-12-16T02:24:33+05:30 IST
ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను సవరించి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా కొత్త వినియోగదారుల కోసం...

ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను సవరించి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా కొత్త వినియోగదారుల కోసం ఫ్రీ సిమ్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. డిసెంబర్ 17, 2020 నుంచి జనవరి 1, 2021 వరకూ ఈ ఫ్రీ సిమ్ ఆఫర్ ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. అయితే.. ఫ్రీ సిమ్ పొందాలనుకునే వారు తొలిగా రూ.100 గానీ అంతకంటే ఎక్కువతో గానీ రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుందని.. రూ.100 చెల్లించిన 16 రోజుల లోపు ఫ్రీ సిమ్ వినియోగదారుడికి అందుతుందని స్పష్టం చేసింది. అయితే.. బీఎస్‌ఎన్‌ఎల్ ఇలాంటి ఫ్రీ సిమ్ ఆఫర్‌కు తెరలేపడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఫ్రీ సిమ్ ఆఫర్లను పలుమార్లు ప్రకటించింది.