‘ఆరోగ్యసేతు’లో మరో సరికొత్త ఫీచర్

ABN , First Publish Date - 2020-08-23T03:21:04+05:30 IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన కొవిడ్ ట్రేసింగ్ యాప్ ‘ఆరోగ్యసేతు’లో మరో సరికొత్త ఫీచర్ వచ్చి

‘ఆరోగ్యసేతు’లో మరో సరికొత్త ఫీచర్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన కొవిడ్-19 ట్రేసింగ్ యాప్ ‘ఆరోగ్యసేతు’లో మరో సరికొత్త ఫీచర్ వచ్చి చేరింది. వ్యాపార సంస్థల కార్యకలాపాలను మరింత సులభతరం చేసేలా ‘ఓపెన్ ఏపీఐ సర్వీస్’ను జత చేసింది. ఈ ఫీచర్ ద్వారా వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అయితే, యూజర్లు ఇందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని, అది భద్రంగా ఉంటుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందులో ఆరోగ్య సేతు స్టేటస్, యూజర్ పేరు తప్ప ఇతర వివరాలు ఉండవని తేల్చి చెప్పింది. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రస్తుతం 15 మంది డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. 

Updated Date - 2020-08-23T03:21:04+05:30 IST