బోల్ట్ రికార్డు బద్దలు కొట్టిన అథ్లెట్.. అసలు నిజం తెలిసి..

ABN , First Publish Date - 2020-07-11T03:22:35+05:30 IST

పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన రికార్డును ఓ అమెరికన్ అథ్లెట్ బద్దలు కొట్టాడు.

బోల్ట్ రికార్డు బద్దలు కొట్టిన అథ్లెట్.. అసలు నిజం తెలిసి..

వాషింగ్టన్: పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన రికార్డును ఓ అమెరికన్ అథ్లెట్ బద్దలు కొట్టాడు. దీంతో సంబరాలు ప్రారంభించిన అతని ఆనందంపై రికార్డు ఇవ్వాల్సిన అధికారులు నీళ్లు కుమ్మరించారు. అసలేం జరిగిందంటే.. అమెరికాకు చెందిన నోవా లైల్స్ అనే 22 ఏళ్ల యువకుడు మంచి అథ్లెట్. ఇటీవల ఇన్‌స్పిరేషన్ గేమ్స్‌లో భాగంగా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ రికార్డును అతను బద్దలు కొట్టాడు. 200మీటర్ల పరుగుల విభాగంలో కేవలం 18.90సెకన్లలోనే అతను రేస్ పూర్తి చేశాడు. దీన్ని పూర్తి చేయడానికి బోల్ట్‌కు 19.19సెకన్లు పట్టింది. అయితే నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా నోవా.. రేస్ ప్రారంభించిన బ్లాక్ తప్పని తేలింది. దీంతో అతను మొత్తమ్మీద 185 మీటర్లే పరిగెత్తినట్లు వెల్లడయింది. దీంతో నోవా సంతోషంపై నీళ్లు గుమ్మరించినట్లు అయింది.

Updated Date - 2020-07-11T03:22:35+05:30 IST