మాస్క్ రూ. 10, శానిటైజర్ రూ. 100 ... ఎక్కడంటే...

ABN , First Publish Date - 2020-03-29T15:04:17+05:30 IST

కరోనా వైరస్ నుండి రక్షించడానికి అవసరమైన మాస్కులు, శానిటైజర్ల కొరతను నివారించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మాస్క్ రూ. 10,  శానిటైజర్ రూ. 100 ... ఎక్కడంటే...

గ్వాలియర్: కరోనా వైరస్ నుండి రక్షించడానికి అవసరమైన మాస్కులు, శానిటైజర్ల కొరతను నివారించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన గ్వాలియర్ జిల్లాలోని ఎనిమిది మహిళా సంఘాల సభ్యులు మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. ఈ మాస్కులను ఒక్కోటి రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. అదేవిధంగా సానిటైజర్లను సరసమైన ధరలకు అందించడానికి డిస్టిలరీల సంస్థలతో  ప్రభుత్వం చర్చలు జరిపింది. కరోనా వైరస్ కారణంగా మాస్కులకు డిమాండ్ పెరిగింది. ప్రామాణిక ఎన్-95 మాస్కులు ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో లేవు. గ్వాలియర్ జిల్లాలోని  8 గ్రూపులకు చెందిన 46 మంది మహిళలు ఇప్పటివరకు 900కి పైగా మాస్కులు తయారు చేశారు.


Updated Date - 2020-03-29T15:04:17+05:30 IST