లాక్‌డౌన్‌లో చిక్కుకున్న భార్య‌... మ‌రో పెళ్లి చేసుకున్న భ‌ర్త‌!

ABN , First Publish Date - 2020-05-18T12:47:02+05:30 IST

లాక్‌డౌన్‌లో చిక్కుకున్నవారు ప‌డుతున్న క‌ష్టాల‌ను వినేవుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఒక విచిత్ర‌మైన ఉదంతం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా భార్య త‌న పుట్టింట్లో చిక్కుకుంది.

లాక్‌డౌన్‌లో చిక్కుకున్న భార్య‌... మ‌రో పెళ్లి చేసుకున్న భ‌ర్త‌!

బ‌రేలీ: లాక్‌డౌన్‌లో చిక్కుకున్నవారు ప‌డుతున్న క‌ష్టాల‌ను వినేవుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఒక విచిత్ర‌మైన ఉదంతం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా భార్య త‌న పుట్టింట్లో చిక్కుకుంది. ఇదే అద‌నుగా భావించిన‌ భర్త తన బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో భార్య‌ మేరా హక్ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ను సహాయం కోసం ఆశ్ర‌యించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధితురాలు నసీమ్‌కు న్యాయం జరిగేలా చూస్తామని మేరా హ‌క్ ని‌ర్వాహ‌కురాలు ఫర్హాత్ నఖ్వీ తెలిపారు. నసీమ్‌కు 2013లో నయీమ్ మన్సూరీతో వివాహం జ‌రిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. మార్చి 19న నసీమ్ తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్లింది. లాక్‌డౌన్ కారణంగా ఆమె అక్క‌డ చిక్కుకుపోయింది. అయితే లాక్‌డౌన్ మధ్యలో తన భర్త బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడని నసీమ్ తెలుసుకుంది. దీంతో ఆమె ఎలాగోలా ఇంటికి చేరుకుని, భ‌ర్త‌పై  మేరా హ‌క్ సంస్థ‌కు ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2020-05-18T12:47:02+05:30 IST