చీరలో పిల్లేరు గంతులు.. అవాక్కవుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2020-12-02T00:38:35+05:30 IST

అలవోకగా పిల్లేరు గంతులు వేస్తున్న ఓ మహిళను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. మామూలుగా అథ్లెట్ దుస్తులు వేసుకుని...

చీరలో పిల్లేరు గంతులు.. అవాక్కవుతున్న నెటిజన్లు!

న్యూఢిల్లీ: అలవోకగా పిల్లేరు గంతులు వేస్తున్న ఓ మహిళను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. మామూలుగా  అథ్లెట్ దుస్తులు వేసుకుని ఈ స్టంట్ చేస్తే పెద్దగా ఆశ్చర్యం ఏమీ అక్కర్లేదు. కానీ చీరకట్టులో ఆమె పిల్లేరు గంతులు (బ్యాక్‌ఫ్లిప్స్) వేయడమే ఇక్కడ అసలు ట్విస్ట్. చీరకట్టుకుని నడవడానికే ఇబ్బంది పడే పరిస్థితుల్లో.. ఇంటర్నేషనల్ యోగా గోల్డ్ మెడలిస్టు మిలీ సర్కార్ వరుసబెట్టి ఏకధాటిగా పిల్లేరు గంతులు వేస్తున్నారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా పిల్లేరు గంతులు వేసేటప్పుడు శరీరం గాల్లో 360 డిగ్రీల మేర గుండ్రంగా తిరగాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం కూడా అవసరమవుతుంది. మంచి సాధన, కృషి చేస్తే తప్ప ఈ స్టంట్ మీద పట్టుసాధించడం కుదరదు. అందునా ఇలాంటి స్టంట్లు చేయడానికి చీరకట్టు ఏమాత్రం సూటవ్వదు. అయినప్పటికీ మిలీ దీన్ని సాధించి చూపించడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ట్విటర్లో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘పురుషులు చేసే పనులన్నీ మహిళలు మరింత మెరుగ్గా చేయగలరు. పురుషులు చేయలేని చాలా పనులను కూడా మహిళలు అలవోకగా చేస్తారు. మిలీ సర్కార్‌ చూడండి.. చీరకట్టులో ఆమె చేస్తున్న బ్యాక్‌ఫ్లిప్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. టాలెంట్‌కు ఈమె పవర్‌హౌస్ లాంటిది..’’ అంటూ ప్రశంసించారు. ‘‘సూపర్.. అదీ అమ్మాయిల పవర్ అంటే. ఆమె ఏదైనా చేయగలదు..’’ అంటూ మరో నెటిజన్ అభినందించారు. Updated Date - 2020-12-02T00:38:35+05:30 IST