-
-
Home » Prathyekam » woman loses 50 thousand rupees after trying to buy 250 rupees meal
-
రూ.250 భోజనం కోసం రూ.50 వేలు పోగొట్టుకున్న మహిళ
ABN , First Publish Date - 2020-12-27T20:05:13+05:30 IST
ఆన్‌లైన్ ఆఫర్లను గుడ్డిగా నమ్మితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసిందే. తాజాగా ఓ మహిళకు అలాంటి పరిస్థితే ఏర్పడింది. సోషల్ మీడియాలో కనపడిన భోజనం ఆఫర్‌ను..

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ ఆఫర్లను గుడ్డిగా నమ్మితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసిందే. తాజాగా ఓ మహిళకు అలాంటి పరిస్థితే ఏర్పడింది. సోషల్ మీడియాలో కనపడిన భోజనం ఆఫర్‌ను చూసి ఇష్టపడి బుక్ చేసుకునేందుకు ఆమె ప్రయత్నించింది. దాని ధర కేవలం రూ.250. అయితే దానిని కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌లో ఓ రూ.10 అడ్వాన్స్ పేమెంట్ చేయాలని ఉంది. దానికోసం ఓ లింక్ కూడా ఆమెకు వచ్చింది. భోజనం బుక్ చేయాలనే తొందరలో ఆమె ఆ లింక్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేసింది. దీనికోసం ఆమె తన డెబిట్ కార్డ్, పిన్ ఎంటర్ చేసింది. అంతే భోజనం ఆర్డర్ బుక్ అవడం పక్కనుంచితే.. ఖాతాలో ఉన్న రూ.50వేల రూపాయలు మొత్తం మాయమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆన్‌లైన్ మోసాలు ఇన్ని జరుగుతున్నా.. అజాగ్రత్తగా ఉండడం సరైన పద్ధతి కాదని, దర్యాప్తు చేస్తామని పోలీసులు ఆమెకు చెప్పి పంపించారు.