తొలి ‘మౌస్’ తయారు చేసిన కంప్యూటర్ ఇంజినీర్ కన్నుమూత!

ABN , First Publish Date - 2020-08-04T04:21:54+05:30 IST

కంప్యూటర్ మౌస్ సృష్టించడానికి తీవ్రంగా శ్రమించిన వారిలో ఒకరైన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ విలియమ్ బిల్ ఇంగ్లీష్ కన్నుమూశారు.

తొలి ‘మౌస్’ తయారు చేసిన కంప్యూటర్ ఇంజినీర్ కన్నుమూత!

కాలిఫోర్నియా: కంప్యూటర్ మౌస్ సృష్టించడానికి తీవ్రంగా శ్రమించిన వారిలో ఒకరైన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ విలియమ్ బిల్ ఇంగ్లీష్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న ఆయన జూలై 26న కాలిఫోర్నియాలో మృతిచెందారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నేవీలో కెరీర్ ప్రారంభించిన విలియమ్.. రిటైర్‌మెంట్ తర్వాత ఎస్‌ఆర్‌ఐ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడే కంప్యూటర్‌కు మౌస్ సృష్టించాలన్న డోగ్లస్ ఎంగెల్‌బార్ట్ ఆలోచనపై పనిచేశారు. దీనికోస తీవ్రంగా శ్రమించిన వారిలో విలియం కూడా ఒకరు.

Updated Date - 2020-08-04T04:21:54+05:30 IST