భర్త క్వారంటైన్‌లో ఉండటం చూసి, ప్రియునితో పరారైన భార్య!
ABN , First Publish Date - 2020-06-18T17:27:44+05:30 IST
లాక్‌డౌన్ కాలంలో భర్త క్వారంటైన్‌కువెళ్లగా, అన్‌లాక్ వన్ ప్రారంభమైన వెంటనే అతని భార్య ప్రియునితో పరారయ్యేందుకు ప్లాన్ చేసింది.

బెగూసరాయ్: లాక్‌డౌన్ కాలంలో భర్త క్వారంటైన్‌కువెళ్లగా, అన్‌లాక్ వన్ ప్రారంభమైన వెంటనే అతని భార్య ప్రియునితో పరారయ్యేందుకు ప్లాన్ చేసింది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరినీ చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఉదంతం బీహార్‌లోని బెగూసరాయ్‌లోగల బఖ్రీ పరిధిలోని షకర్పురాలో చోటుచేసుకుంది. ఖాగారియా జిల్లాకు చెందిన యువకునికి బెగూసరాయ్‌కి చెందిన యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన 9 నెలల తరువాత అతను భార్యను అత్తారింటిలో దిగబెట్టి, పని కోసం గుజరాత్ వెళ్ళాడు. అయితే ఆ తరువాత ఆమె తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ తన ప్రియుడిని కలుసుకుంది. అయితే ఇంతలో భర్త గుజరాత్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అక్కడ అతను 14 రోజులు క్వారంటైన్‌లో ఉండవలసి వచ్చింది. అది పూర్తయ్యాక అతను తన అత్తవారింటికి వెళ్లాడు. అయితే తన భార్య ప్రియునితో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నదని అతను తెలుసుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఆ మహిళతోపాటు ఆమె ప్రియుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెను భర్తతో పాటు పంపించారు.