నూతన ఆలయ పునాదుల్లో.... 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి అర్పితం!

ABN , First Publish Date - 2020-12-28T17:27:24+05:30 IST

రాజస్థాన్‌లోని ఝాల్వాడా జిల్లాలో విచిత్ర దృశ్యం కనిపించింది. రత్లాయీలో...

నూతన ఆలయ పునాదుల్లో.... 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి అర్పితం!

ఝాల్వాడా: రాజస్థాన్‌లోని ఝాల్వాడా జిల్లాలో విచిత్ర దృశ్యం కనిపించింది. రత్లాయీలో నూతనంగా నిర్మించబోతున్న దేవనారాయణ్ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా తీసిన పునాదులలో గ్రామస్తులు 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి పోశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు రామ్‌లాల్ గుర్జర్ మాట్లాడుతూ దేవనారాయణ్ ఆలయ శంకుస్థాపన సందర్భంగా గుర్జర్ సమాజంలోని ప్రజల నుంచి 11 వేల లీటర్ల పాటు, పెరుగు, నెయ్యి అందాయన్నారు. 



వీటిలో 1,500 లీటర్ల పెరుగు, ఒక క్విటాల్ నెయ్యి, మిగిలిన మొత్తంలో పాలు ఉన్నాయన్నారు. వీటి మొత్తం ఖరీదు రూ. 1.50 లక్షలు ఉంటుందన్నారు. ఆలయ నిర్మాణం సందర్భంగా పాల పదార్థాలు సమర్పించడం తమ ఆచారమని పేర్కొన్నారు. ఈ విధంగా గతంలో కూడా ఆచరించామన్నారు. భగవంతుడు తమ పశువులను సంరక్షిస్తున్నాడని, అందుకే అ భగవంతుడు ప్రసాదించిన పాల పదార్థాలను అర్పించామని తెలిపారు.

Updated Date - 2020-12-28T17:27:24+05:30 IST