వామ్మో... ఈ చిరుతపులి చాలా గ్రేట్! ఏం చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-03-31T03:36:47+05:30 IST

ప్రకృతిలో జరిగే ఘటనలు తరచూ మనుషుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి పర్వీన్ కాస్వాన్ ఇటీవల ట్విటర్‌లో షేర్ చేశారు.

వామ్మో... ఈ చిరుతపులి చాలా గ్రేట్! ఏం చేసిందో తెలిస్తే..

న్యూఢిల్లీ: ప్రకృతిలో జరిగే ఘటనలు తరచూ మనుషుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి పర్వీన్ కాస్వాన్ ఇటీవల ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది ఓ చిరుత పులికి సంబంధించిన వీడియో. తను వేటాడిన జింకను అది దాదాపు 12 అడుగుల ఎత్తున్న చెట్టు కొమ్మపైకి లాక్కెళ్లుతుంది. మొదట ఒక్క క్షణం పాటు చెట్టుని, జింక నుంచి పరికించి తరువాత చిరుత ఓ నిర్ణయానికి వస్తుంది. అనంతరం తనకు తిరుగే లేదన్నట్టు జింక కళేబరాన్ని నోట కరిచి చక చకా చెట్టేక్కుస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే దీనికి 10 వేలకు పైగా లైకులు వచ్చాయి. Updated Date - 2020-03-31T03:36:47+05:30 IST