లాక్ డౌన్ టెన్నిస్: ఈ అమ్మాయిల ఆటకు ప్రపంచం ఫిదా!

ABN , First Publish Date - 2020-04-22T03:32:23+05:30 IST

మేడపై నిలబడి టెన్నిస్ ఆడిన అమ్మాయిలు

లాక్ డౌన్ టెన్నిస్: ఈ అమ్మాయిల ఆటకు ప్రపంచం ఫిదా!

న్యూఢిల్లీ: ఎదురెదురుగా రెండు ఇళ్లు. ఒక ఇంటి మేడపై విటోరియా అనే టీనేజ్ యువతి టెన్నిస్ రాకెట్ పట్టుకుని సిద్ధంగా ఉంది. ఎదిరంట్లో ఉండే ఆమె స్నేహితురాలు కెరోలా పెస్సినా కూడా తన ఇంటీ మేడ మీద సిద్ధంగా ఉంది. కొద్ది క్షణాల తరువాత ఆట మొదలైంది. మేడ మీద ఉంటూనే సర్వీసులు చేస్తూ అమ్మాయిలిద్దరూ ఆట కొనసాగించారు.


అంత ఎత్తున నిలబడి ఆట ఆడుతున్నా కూడా వారిద్దరూ బంతి కిందపడకుండా 12 సార్లు  సర్వీసు చేశారు. వారి తల్లిదండ్రుల్లో ఒకరు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అఫ్ కోర్స్.. ఇలా ఆడటం అంత ఈజీ ఏమీ కాదు. అనేక సార్లు బంతి ఎదిరింటి మేడ మీదకు వెళ్లకుండానే కింద పడిపోయింది. అయితే ఇటువంటి ఇబ్బందులుంటాయని బాలికల తండ్రులకు ముందే తెలుసు. దీంతో వారు నేల మీద సిద్ధంగా నిలబడి.. బంతి కిదపడగానే దాన్ని తమ పిల్లలకు అందించారు.


కరోనా లాక్ డౌన్ కారణంగా మైదానాల్లో ఆటలు ఆడలేక ఈ అమ్మాయిలిద్దరూ ఇలా కొత్తగా ట్రై చేశారు. ఇళ్లలో ఎలా ప్రాక్టీసు చేస్తున్నారో చెప్పాలంటూ వాళ్ల కోచ్ అడిగిన ప్రశ్నకు వాళ్లిద్దరూ ఇలా సమాధానం చెప్పారు. అయితే వీరి ఆటకు మాత్రం ప్రపంచం ఫిదా అవుతోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటారా? ఇటలీలోని ఫనాలే లిగ్వెర్ అనే టౌన్ ఈ అపురూప ఘట్టానికి వేదిక అయింది.  
Updated Date - 2020-04-22T03:32:23+05:30 IST