లాక్‌డౌన్‌లో రోజూ 300 శున‌కాల‌కు ఆహారం: విద్యార్థినికి కితాబు!

ABN , First Publish Date - 2020-05-09T11:51:11+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో వీధుల్లో తిరుగుతున్న శున‌కాలు ఆహారం లేక అల‌మ‌టిస్తున్నాయి. దీనిని గ‌మ‌నించిన ఢిల్లీకి చెందిన ...

లాక్‌డౌన్‌లో రోజూ 300 శున‌కాల‌కు ఆహారం: విద్యార్థినికి కితాబు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో వీధుల్లో తిరుగుతున్న శున‌కాలు ఆహారం లేక అల‌మ‌టిస్తున్నాయి. దీనిని గ‌మ‌నించిన ఢిల్లీకి చెందిన ఒక విద్యార్థిని వాటికి సాయం చేసేందుకు ముందుకువ‌చ్చారు. వైద్య విద్యార్థిని విభ తోమర్ కుక్కలకు ఆహారం అందించేందుకు వీధి బాట‌ప‌ట్టారు.... తాను చిన్నప్పటి నుంచీ జంతువులను ప్రేమిస్తుంటాన‌ని, పైగా వైద్య విద్యార్థినిని కావ‌డంతో వాటికి సహాయం చేయడం త‌న బాధ్య‌త అని విభ చెప్పారు. సాధారణ రోజుల్లో వీధి కుక్క‌ల‌కు ఎవ‌రో ఒక‌రు ఆహారం అందిస్తార‌ని, ఇప్పుడు తిండి దొర‌క‌క అవి అల‌మ‌టిస్తున్నాయ‌ని అన్నారు. దీంతో వీటి ప‌రిస్థితి దారుణంగా త‌యార‌య్యింద‌న్నారు. అందుకే తాను రోజూ 300కిపైగా కుక్క‌ల‌కు ఆహారం అందిస్తున్నాన‌ని తెలిపారు. ఆమె శున‌కాల‌కు ఆహారం అందించ‌డం గురించి తెలుసుకున్న‌వారంతా ఆమెను అభినందిస్తున్నారు.

Updated Date - 2020-05-09T11:51:11+05:30 IST