గంగానదిలో ఈదిన చిరుతపులి

ABN , First Publish Date - 2020-10-21T17:52:58+05:30 IST

హరిద్వార్ సమీపంలోని గంగా నదిలో ఓ చిరుతపులి ఈదుతూ తీరం దాటిందని వన్యప్రాణి అధికారుల పరిశీలనలో తేలింది....

గంగానదిలో ఈదిన చిరుతపులి

రేడియో కాలరింగ్ తో తేలిన నిజం

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): హరిద్వార్ సమీపంలోని గంగా నదిలో ఓ చిరుతపులి ఈదుతూ తీరం దాటిందని వన్యప్రాణి అధికారుల పరిశీలనలో తేలింది. ఉత్తరాఖండ్ అటవీశాఖ వన్యప్రాణి విభాగం రేడియో కాలర్  ద్వారా ఓ చిరుతపులి కదిలికలను  పర్యవేక్షిస్తోంది. చిరుత పులి ఈదుకుంటూ గంగానదిని దాటిందని రేడియో కాలరింగ్ ద్వారా తేలడంతో వన్యప్రాణివిభాగం అధికారులు ఆశ్చర్యపోయారు. చిరుతపులి ఎలాంటి ప్రదేశాల్లో ఎంత సమయం గడుపుతోంది, చిరుత ఇష్టపడే ఆవాసాల గురించి వన్యప్రాణి విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారు. 


హరిద్వార్, నరేంద్రనగర్ అటవీ విభాగాల్లోని రెండు  చిరుతపులులకు  రేడియో కాలర్ అమర్చామని, వీటి కదలికలను  తాము పరిశీలిస్తున్నామని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ జె.ఎస్. సుహాగ్ చెప్పారు. ఆహారం కోసం చిరుతపులి హరిద్వార్ వద్ద గంగానదిని దాటిందని తాము భావిస్తున్నట్లు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ జె.ఎస్. సుహాగ్ తెలిపారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 15 చిరుతపులులకు తాము రేడియో కాలర్  అమరుస్తున్నట్లు సుహాగ్ వివరించారు. చిరుతపులులు నీటిలో ఈదుతాయని వన్యప్రాణి నిపుణుడు ఏజీ అన్సారీ చెప్పారు. 

Updated Date - 2020-10-21T17:52:58+05:30 IST