నాకు కరోనా వచ్చింది..కంట్రోల్ రూంకు రైలు ప్రయాణికుడి మెసేజ్

ABN , First Publish Date - 2020-06-23T16:38:23+05:30 IST

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని మెసేజ్ రావడంతో, అతను కరోనా కంట్రోల్ రూంకు సమాచారం అందించిన ఘటన....

నాకు కరోనా వచ్చింది..కంట్రోల్ రూంకు రైలు ప్రయాణికుడి మెసేజ్

రైలు నుంచి దించేసిన అధికారులు

న్యూఢిల్లీ : రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని మెసేజ్ రావడంతో, అతను కరోనా కంట్రోల్ రూంకు సమాచారం అందించిన ఘటన డెహ్రాడూన్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది. నోయిడాలోని బ్యాటరీ పరిశ్రమలో పనిచేస్తున్న 48 ఏళ్ల ఓ వ్యక్తి తన స్వస్థలమైన రిషికేష్ లోని శ్యాంపూర్ వెళ్లేందుకు ఘజియాబాద్ రైల్వేస్టేషనులో జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. ఘజియాబాద్ లో ఇతనికి కరోనా పరీక్ష చేసినా రిపోర్టు రాలేదు. రైలు ఎక్కాక ప్రయాణిస్తుండగా అతని ఫోన్ కు పాజిటివ్ అని మెసేజ్ వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడు కరోనా కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. తోటి ప్రయాణికుడికి కరోనా వచ్చిందని తేలడంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కరోనా సోకిన ప్రయాణికుడిని హరద్వార్ లో రైలు ఆపి అతన్ని దించి మేలా ఆసుపత్రికి తరలించారు. కరోనా రోగితో ప్రయాణించిన 22 మంది ప్రయాణికులను క్వారంటైన్ కు తరలించారు. కరోనా లక్షణాలు లేకపోవడంతో రైలు ప్రయాణానికి అనుమతించామని, తర్వాత కరోనా ఉందని రిపోర్టు రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించామని రైల్వే అధికారులు చెప్పారు. 

Read more