విచిత్ర వివాహం: శానిటైజర్ పన్నీరు, మాస్కుల దండలు

ABN , First Publish Date - 2020-04-21T14:37:42+05:30 IST

పెళ్లి అంటే ఎంతో సందడి వాతావరణం ఉంటుంది. అయితే ప్రస్తుత లొక్డౌన్ సమయంలో పెళ్లి వేడుకల తీరు మారిపోయింది. ఇలాంటి ప్రత్యేకమైన వివాహం యూపీలోని హమీర్‌పూర్‌ పరిధిలోగల...

విచిత్ర వివాహం: శానిటైజర్ పన్నీరు,  మాస్కుల దండలు

హమీర్‌పూర్: పెళ్లి అంటే ఎంతో సందడి వాతావరణం ఉంటుంది. అయితే ప్రస్తుత లొక్డౌన్ సమయంలో పెళ్లి వేడుకల తీరు మారిపోయింది. ఇలాంటి  ప్రత్యేకమైన వివాహం యూపీలోని హమీర్‌పూర్‌ పరిధిలోగల చాని బుజుర్గ్ గ్రామంలో జరిగింది. వీరనారాయణ కుమార్తె ప్రియకు ఖని ఖుర్ద్ గ్రామంలో నివసిస్తున్న కామతా ప్రసాద్ పాండే పెద్ద కుమారుడు శివకాంత్ వివాహం నిశ్చయమయ్యింది. ఏప్రిల్ 19 న ముహూర్తం నిర్ణయించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ వివాహం జరిపించారు. రిసెప్షన్ సమయంలో గేటు వద్ద బంధువులకు  దండలు వేయడానికి బదులు మాస్కులు వేశారు. వివాహానికి వచ్చిన కొద్దిమందికి శానిటైజర్లు ఇచ్చారు. సోషల్ డిస్టెన్స్ పాటించారు. వివాహ  తంతు పూర్తయ్యాక  వధువును వరుని ఇంటికి పంపించారు. 


Updated Date - 2020-04-21T14:37:42+05:30 IST