ట్విట్టర్‌లో ఇవే ట్రెండింగ్‌!

ABN , First Publish Date - 2020-10-28T00:41:06+05:30 IST

తెల్లవారితే చాలు.. సెన్సేషనల్‌ ఇష్యూస్‌ ఏంటో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ను బట్టి అంచనాకు వచ్చేస్తున్న రోజులివి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎన్ని ఉన్నా.. ట్విట్టర్‌ ట్రెండే వేరు.

ట్విట్టర్‌లో ఇవే ట్రెండింగ్‌!

తెల్లవారితే చాలు.. సెన్సేషనల్‌ ఇష్యూస్‌ ఏంటో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ను బట్టి అంచనాకు వచ్చేస్తున్న రోజులివి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎన్ని ఉన్నా.. ట్విట్టర్‌ ట్రెండే వేరు.  ఒకరకంగా ట్రెండింగ్‌లో ట్విట్టర్‌ లీడర్‌షిప్‌ మెయింటెయిన్‌ చేస్తోంది.  మరి.. ఇవాళ ట్విట్టర్‌లో ఏమేం ట్రెండింగ్‌ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

  


3. #AbkiBaarJustice4SSR

న్యాయం చేస్తే.. ఓటు మీకే!

దేశంలో కలకలం రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మృతిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, అతని హత్యలో మహా సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడి హస్తముందని రాణే ఆరోపించారు. అలాగే సుశాంత్‌ మాజీ మేనేజర్ దిశా సలియన్ మృతికి, సుశాంత్ హత్యకు సంబంధముందని ఆయన వెల్లడించారు. దీంతో నెటిజన్లు మరోసారి సుశాంత్‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ మొదలుపెట్టారు. రెండు నెలల విచారణ తర్వాత కూడా ఈ కేసులో సీబీఐ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం ఉపయోగించిన 'అబ్‌ కీ బార్‌ మోదీ సర్కార్" నినాదాన్ని తలపిస్తూ.. #AbkiBaarJustice4SSR హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌ను హోరెత్తించారు. కొందరైతే సుశాంత్‌కు న్యాయం చేస్తే జీవితాంతం బీజేపీకే ఓటేస్తానంటూ ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు.


4. #justice4Nikita

ఆమెకు న్యాయం కావాలి

పట్టపగలే ఓ ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన హరియాణా యువతి నికితకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా హోరెత్తింది. ఫరీదాబాద్‌లోని ఓ కాలేజి నుంచి నికితా తోమర్‌ బయటకు రాగానే ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారో ఇద్దరు మిత్రులు. వారిలో తఫీక్ అనే యువకుడు ఆమెను బలవంతంగా లాక్కువెళ్లడానికి ట్రై చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో చేతిలోని తుపాకీతో కాల్చిపారేశాడు. దేశం ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో నికితకు న్యాయం చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే #justice4Nikita అంటూ ట్విట్టర్‌ను వేడెక్కించారు. ఈ హాష్‌ట్యాగ్‌పై కొన్ని గంటల్లోనే 77వేలకుపైగా ట్వీట్లు నమోదయ్యాయి. దీంతో ట్విట్టర్‌ ట్రెండింగ్‌ జాబితాలో ఈ హ్యాష్‌ట్యాగ్‌ చేరిపోయింది.
5. "Dil Mange Shehnaaz"

మనసు ఆగట్లేదు!


బిగ్‌బాస్‌ సెన్సేషన్ షెహనాజ్ గిల్.. ఇటీవల సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటోంది. గతంలో యూట్యూబ్‌ లైవ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, ట్వీట్లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. ఏ కారణం వల్లనో కొంచెం గ్యాప్ తీసుకున్నారు. దీంతో ఆమె అభిమానులు అల్లాడిపోతున్నారు. వాళ్ల మనసులన్నీ షెహనాజ్‌ కబుర్లు వినాలని తహతహలాడుతున్నాయి. అందుకే ఆమెకు తమ విజ్ఞప్తిని తెలియజేయడం కోసం "Dil Mange Shehnaaz" అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ టాపిక్ మొదలైన గంటల్లోనే ట్విట్టర్ ట్రెండింగ్‌లో చేరిపోయిందంటే.. ఆమె అభిమానులు ఏ రేంజ్‌లో రిక్వెస్ట్‌లు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి అభిమానుల అభ్యర్థన అర్థం చేసుకున్న షెహనాజ్‌ మళ్లీ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుందో? లేక మరికొంత కాలం ఈ గ్యాప్‌ కొనసాగిస్తుందో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.


1. #lovejihaad

అది లవ్ జిహాదే!

పట్టపగలే ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి, అది విఫలం కావడంతో ఆ అమ్మాయిని కాల్చిచంపేశాడో ఉన్మాది. ఈ దారుణం హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. ఓ కాలేజీ నుంచి బయటకి వస్తున్న 21 ఏళ్ల నికిత తోమర్ అనే యువతిని.. తఫీక్ అనే యువకుడు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిండాడు. తఫీక్ స్నేహితుడు కూడా ఇందుకు సహకరించాడు. అయితే నికిత ప్రతిఘటించడంతో ఆమెను తుపాకీతో తఫీక్‌ కాల్చిపారేశాడు. ఈ దారుణం దేశంలో కలకలం రేపింది. ఇదంతా అమ్మాయి మతం మార్చుకోలేదనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇదే 'లవ్ జిహాద్ నిజ స్వరూపం' అంటూ ట్విట్టరాటి దుమ్మెత్తిపోస్తున్నారు. #lovejihaad హాష్‌ట్యాగ్‌తో విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు. ఇంతటి సీరియస్ ఇష్యూపై సెక్యులర్‌ వాదులు నోరు మెదపడం లేదంటూ విమర్శిస్తున్నారు. దీంతో ఈ హాష్‌ట్యాగ్‌పై రెండు గంటల్లోనే 40వేలపైగా ట్వీట్లు నమోదు కావడంతో ట్విట్టర్ ట్రెండింగ్‌ జాబితాలో చేరిపోయింది.


2. #Munger

ఇదేం దారుణం?

దుర్గామాత ఉత్సవాలు చేసుకుంటూ విగ్రహం పెట్టుకున్నారు కొందరు భక్తులు. దాని ముందు చేరి భజనలు చేసుకుంటున్నారు. ఇంతలో హడావుడిగా అక్కడకు చేరుకున్న పోలీసులు భక్తులపై విరుచుకుపడ్డారు. భక్తుల్ని గొడ్డులను బాదినట్లు బాదారు. ప్రతిఘటించిన వారిని కాల్చిపారేశారు. ఇదంతా బిహార్‌లోని ముంగర్‌ ప్రాంతంలో జరిగిన ఘోరమే. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏం పాపం చేశాడని ఓ 22 ఏళ్ల యువకుడిని కాల్చి చంపేశారు? అంటూ పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే #Munger హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను నెటిజన్లు ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. పోలీసుల దుశ్చర్యలను ఎండగడుతున్నారు.Updated Date - 2020-10-28T00:41:06+05:30 IST