టిక్‌టాక్‌ తలదన్నేలా హైదరాబాదీ హైస్టార్‌ యాప్‌

ABN , First Publish Date - 2020-08-12T09:25:38+05:30 IST

టిక్‌టాక్‌ తలదన్నేలా హైదరాబాదీ హైస్టార్‌ యాప్‌

టిక్‌టాక్‌ తలదన్నేలా హైదరాబాదీ హైస్టార్‌ యాప్‌

15సెకన్లు కాదు.. 1నిమిషం వీడియో


హైదరాబాద్‌ సిటీ,ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తర్వాత పలు భారతీయ కంపెనీలు వినూత్న ఆవిష్కరణలతో యువతను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. టెక్నాలజీ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్‌ అయితే టిక్‌టాక్‌ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో.. నగరానికి చెందిన పబ్బాస్‌ గ్రూప్‌.. హైస్టార్‌ అనే ఓ యాప్‌ను విడుదల చేసింది. గతంలో కొన్ని యాప్స్‌ 15సెకన్ల నిడివి కలిగిన వీడియో మాత్రమే చేసుకునే అవకాశం ఇచ్చేవని, తమ యాప్‌లో ఒక నిమిషం వరకూ వీడియోలు చేసుకోవచ్చని హైస్టార్‌ యాప్‌ సీఈఓ స్వామి ముద్దం చెప్పారు.  డైలాగ్స్‌, కామెడీ, గేమింగ్‌, ఫుడ్‌, స్పోర్ట్స్‌, మీమ్స్‌... ఇలా విభిన్న అంశాల్లో వీడియోలు చేసి ప్రదర్శించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన వారికి పలు కంపెనీల ప్రకటనల్లో నటించే అవకాశం సైతం కల్పిస్తున్నామన్నారు. తద్వారా పేరు ప్రతిష్టలతో పాటుగా సంపాదనా ఉంటుందని 

పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-12T09:25:38+05:30 IST