గంట ముందుగా వెళ్లిపోయిన రైలు... ఆందోళనకు దిగిన 500 మంది ప్రయాణికులు

ABN , First Publish Date - 2020-12-06T17:30:57+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని గాజీ‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఆ సమయంలో 500 మంది రైలు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శనివారం సాయంత్రం సుహేల్ దేవ్‌ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సిన...

గంట ముందుగా వెళ్లిపోయిన రైలు... ఆందోళనకు దిగిన 500 మంది ప్రయాణికులు

గాజీపూర్: ఉత్తరప్రదేశ్‌లోని గాజీ‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఆ సమయంలో 500 మంది రైలు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శనివారం సాయంత్రం సుహేల్ దేవ్‌ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సిన 500 మంది ప్రయాణికులు నిర్ణీత సమయానికన్నా గంట ముందుగానే ట్రైన్ వెళ్లిపోవడంతో స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. దీంతో రైల్వే అధికారులు... ఆ రైలు ప్రయాణికులకు టిక్కెట్ మొత్తాన్ని వాపసు చేస్తామని, లేదా మరోట్రైన్‌లో వారిని తరలిస్తామని ప్రకటిస్తూ నోటీసు అంటించారు.


వివరాల్లోకి వెళితే కొన్నిరోజుల క్రితం రైళ్ల రాకపోకల సమయాలను మార్చారు. గతంలో సుహేల్‌దేవ్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4 గంటలకు బయలుదేరేది. ఇప్పుడు ఆ రైలు బయలుదేరే సమయాన్ని 3 గంటలకు మార్చారు. అయితే ఈ విషయం తెలియని ఆ రైలు ఎక్కాల్సిన 500 మంది ప్రయాణికులు సాయంత్రం 4 గంటలకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ట్రైన్ ముందుగానే వెళ్లిపోయిందని తెలుసుకుని వారంతా ఆందోళనకు దిగారు. రైల్వే అధికారులు కలుగజేసుకుని సమస్యను పరిష్కరించారు. 


Updated Date - 2020-12-06T17:30:57+05:30 IST