ఫ్లైఓవర్ మధ్యలో రెస్ట్ తీసుకుంటున్న పులి.. స్తంభించిన ట్రాఫిక్!

ABN , First Publish Date - 2020-07-15T03:05:21+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని నేషనల్ హైవే నంబర్ 7పై మంగళవారం ఓ వింత ఘటన జరిగింది.

ఫ్లైఓవర్ మధ్యలో రెస్ట్ తీసుకుంటున్న పులి.. స్తంభించిన ట్రాఫిక్!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని నేషనల్ హైవే నంబర్ 7పై మంగళవారం ఓ వింత ఘటన జరిగింది. రహదారిపై ఉన్న ఓ ఫ్లైఓవర్‌పైకి ఓ పులి వచ్చింది. ఫ్లైఓవర్ మధ్యలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆ పులిని చూసి వాహనదారులు భయపడిపోయారు. ఆ ఫ్లైఓవర్ ఎక్కడానికి కూడా వెనకడుగు వేశారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ పులి కనిపించిన ప్రాంతం పెంచ్ నేషనల్ పార్క్‌కు సంబంధించిన బఫర్ జోన్‌లోకి వస్తుందట. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వీడియోల్లో సదరు పులి గర్జిస్తూ కనబడుతోంది.

Updated Date - 2020-07-15T03:05:21+05:30 IST