-
-
Home » Prathyekam » there was no benefit in traditional farming started growing guava with new technology
-
రెండు కిలోల బరువుండే జామ సాగు చేస్తూ... ఏటా రూ. 10 లక్షల ఆదాయం!
ABN , First Publish Date - 2020-12-27T14:27:30+05:30 IST
రెండు కిలోల బరువుండే జామ కాయలను ఎప్పుడైనా చూశారా? వ్యవసాయం కన్నా జామ సాగు లాభదాయకమని భావించిన ఒక రైతు...

టంకారా: రెండు కిలోల బరువుండే జామ కాయలను ఎప్పుడైనా చూశారా? సాధారణ వ్యవసాయం కన్నా జామ సాగు లాభదాయకమని భావించిన ఒక రైతు ఇప్పుడు ఏడాదికి రూ. 10 లక్షలు సంపాదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గుజరాత్‌లోని టంకారా ప్రాంతానికి చెందిన మగన్ కమ్రియా నూతన సాంకేతికత సాయంతో జామ సాగును చేపట్టారు. రెండు కిలోల బరువుండే జామను సాగు చేయడం ప్రారంభించారు. మొత్తం 50 ఎకరాల భూమిలో ఈ విధమైన జామను సాగుచేశారు. దీంతో ప్రస్తుతం ఏడాదికి రూ. 10 లక్షల వరకూ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
ఈ సందర్భంగా మగన్ మాట్లాడుతూ తన పొలంలో మొదట్లో పెసలు, మినుములు పండించేవాడినని, అయితే పెట్టుబడికి తగిన ఫలితం ఉండేదికాదన్నారు. దీంతో ఐదేళ్లక్రితం ఇజ్రాయిల్ టెక్నిక్ సాయంలో పండించే జామ సాగు గురించి తెలుసుకుని, దానిని చేపట్టాలనుకున్నారన్నారు. తరువాత ఛత్తీస్ గఢ్‌లోని రాయపూర్‌లో లభ్యమయ్యే థాయిల్యాండ్‌లో సాగుచేసే ఐదువేల జామ మొక్కలను తీసుకువచ్చి నాటానన్నారు. తాను మొదట్లో ఇజ్రాయిల్ టెక్నాలజీతో జామ సాగు విధానాలను తెలుసుకున్నానన్నారు. ఈ విధానంలో జామ మొక్కలకు తగినంత నీరు అంది, అవి ఏపుగా పెరిగాయని తెలిపారు. ఏడాదిన్నరలో తన కష్టానికి తగిన ఫలితం వచ్చిందని, ఈ జామ రుచులు కూడా అద్భుతంగా ఉన్నాయని, మంచి ధర కూడా పలుకుతున్నదన్నారు.
