వారం రోజులు రోడ్డుపై చెత్త ఊడ్చండి

ABN , First Publish Date - 2020-12-25T08:41:06+05:30 IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఇన్‌స్పెక్టర్‌కు కర్ణాటక హైకోర్టు గురువారం భారీ షాక్‌నిచ్చింది.

వారం రోజులు రోడ్డుపై చెత్త ఊడ్చండి

పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు కర్ణాటక హైకోర్టు ఆదేశం


బెంగళూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఇన్‌స్పెక్టర్‌కు కర్ణాటక హైకోర్టు గురువారం భారీ షాక్‌నిచ్చింది. తను పనిచేసే పోలీసు స్టేషన్‌ ముందే వారం రోజుల పాటు చెత్త ఊడ్చాల ని ధర్మాసనం ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. కలబురిగి జిల్లా మిణజగి తండాకు చెందిన కూలీ మహిళ తారాబాయి కుమారుడు సురేష్‌ అక్టోబరు 20న తప్పిపోయాడంటూ స్టేషన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు ఇన్‌స్పెక్టర్‌ బాఽధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించకపోగా తప్పిపోయిన బాలుడి ఆచూకీ వెతికే ప్రయ త్నం కూడా చేయలేదు. దీంతో తారాబాయి కుమారుడిని వెతికి పెట్టాలంటూ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు ద్విసభ్యధర్మాసనం న్యాయమూర్తులు ఎస్‌. సునిల్‌దత్‌ యాదవ్‌, పీ. కృష్ణభట్‌ గురువారం సంచలన తీర్పునిచ్చారు. 

Updated Date - 2020-12-25T08:41:06+05:30 IST