-
-
Home » Prathyekam » Sonu Sood Cycle Actor Sonu Sood
-
సోనూసూద్ కంటతడి
ABN , First Publish Date - 2020-11-26T00:35:49+05:30 IST
సోనూసూద్ కంటతడి

ముంబై: తన అభిమాన హీరోను చూసేందుకు ఓ వీరాభిమాని వందల కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్‌పై బయల్దేరారు. బీహార్ రాష్ట్రానికి చెందిన అర్మాన్ అనే అభిమాని బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను కలిసేందుకు బీహార్ నుంచి ముంబైకి బయల్దేరారు. తనను చూసేందుకు వందల కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్‌పై వస్తున్న అభిమాని గురించి తెలుసుకున్న నటుడు సోనుసూద్ కంటతడి పెట్టుకున్నారు.
తనపై అభిమాని చూపించిన ప్రత్యేక ప్రేమాభినాలకు సోనూసూద్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూసూద్ మార్గ మధ్యంలో అభిమానితో మాట్లాడి విమానంలో ముంబైకి వచ్చే ఏర్పాట్లు చేశారు. అప్పటికే అభిమాని అర్మాన్ వారణాసి చేరుకున్నారు. అభిమాని రాకపోకల రవాణా ఖర్చులను తానే భరిస్తానని, అతని సైకిల్ కూడా తిరిగి తన వెంటే పంపిస్తానని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు.