మానవత్వ హంతకి కరోనా... తండ్రి మృతదేహాన్ని మోసేది లేదంటూ....

ABN , First Publish Date - 2020-04-21T18:04:37+05:30 IST

కరోనా సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో అనుబంధాలు మంటగలుస్తున్నాయి. జార్ఖండ్ లోని జంషెడ్పూర్ లో గల శాస్త్రి నగర్ కు చెందిన 52 ఏళ్ల వివేక్ సింగ్ అనుమానాస్పద పరిస్థితులలో ...

మానవత్వ హంతకి కరోనా... తండ్రి మృతదేహాన్ని మోసేది లేదంటూ....

జంషెడ్పూర్: కరోనా సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో అనుబంధాలు మంటగలుస్తున్నాయి. జార్ఖండ్ లోని జంషెడ్పూర్ లో గల శాస్త్రి నగర్ కు చెందిన 52 ఏళ్ల వివేక్ సింగ్ అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు.  ఈ నేపథ్యంలో అతని కుమారులు తండ్రి మృతదేహాన్ని మోసేందుకు నిరాకరించారు. వివేక్ సింగ్ మృతి చెందాడన్న విషయాన్ని  స్థానికులు పోలీసులకు తెలిపారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వివేక్ సింగ్ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతను గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. వివేక్ సింగ్ కుమారులను పోలీసులు సంప్రదించగా వారు  తండ్రి మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి  నిరాకరించారు. స్థానికులు వివేక్ కరోనాతో మరణించారని భయపడ్డారు. సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ బృందం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు నిర్వహించింది. మృతదేహాన్ని పరీక్షించడానికి ఆరోగ్య శాఖ ఎంజిఎం మెడికల్ కాలేజీ వైరాలజీ విభాగానికి శాంపిల్  పంపింది. పోలీసులు ఆ మృతదేహాన్ని ఎంజిఎం హాస్పిటల్ లోని కోల్డ్ రూంలో ఉంచారు. 

Updated Date - 2020-04-21T18:04:37+05:30 IST